ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల విమర్శల దాడిని ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రష్యా నుంచి తీపి కబురు వచ్చింది. మోడీకి ప్రపంచంలో మరో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ప్రధాని మోడీకి రష్యా తన అత్యున్నత పౌర పురస్కారం సెయింట్ ఆండ్రూ అవార్డ్ ఇవ్వాలని నిర్ణయించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇందుకు తన ఆమోద ముద్ర వేశారు. కొన్ని రోజుల క్రితమే ప్రధానమంత్రి మోడీకి అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఇటీవలే యుఏఈ ఆయనకు జాయెద్ అవార్డ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 

'12 ఏప్రిల్ న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సెయింట్ ఆండ్రూ అంటే రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఇస్తున్నట్టు ప్రకటించడమైంది' అని రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్-రష్యాల మధ్య సంబంధాలన బలోపేతం చేసినందుకు ప్రధానమంత్రి మోడీకి ఈ పురస్కారం అందజేస్తున్నారు.

ఈ అవార్డు అందుకొంటున్న మొదటి భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే. ఇంతకు ముందు ఈ సన్మానం చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కి కూడా లభించింది.