మోడీని హీరోలా చూపించాడు !

మోడీని హీరోలా చూపించాడు !

ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా 'పిఎం నరేంద్రమోదీ' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మోడీ పాత్రను వివేక్ ఒబెరాయ్ చేయడం జరిగింది.  తాజాగా చిత్ర ట్రైలర్ విడుదలైంది.  అందులో మోడీ బాల్యం నుండి ప్రధాని అయ్యే వరకు అన్ని ముఖ్యమైన అంశాలను చూపడం జరిగింది.  

గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్లను సైతం ప్రస్తావించారు.  ప్రతి దశలోనూ దర్శకుడు మోడీ పాత్రను  హీరోలా ఎలివేట్ చేశారు.  ముఖ్యంగా ఇందిరా గాంధీ ప్రభుత్వంతో మోడీ విభేదాల్ని హైలెట్ చేశారు.  ఈమధ్యే జరిగిన ఉగ్రదాడులు, వాటికి ప్రతీకారంగా భారత్ చేసిన ప్రతిదాడుల్ని చూపించారు.  మరి ఏప్రిల్ 5న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.  ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలకానుంది.