ఎన్నికల ఫలితాలపై మోడీ రియాక్షన్‌..

ఎన్నికల ఫలితాలపై మోడీ రియాక్షన్‌..

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురేలేకుండా పోయింది.. ఎన్డీఏ కూటమి దాదాపు 350 సీట్ల ఆధిక్యంలో ఉండగా... బీజేపీయే ఏకంగా దాదాపు 300 స్థానాలను కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. దీంతో మరోసారి నరేంద్ర మోడీ గాలి బలంగా వీచిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఫలితాలపై సోషల్ మీడియా వేదికగా తొలిసారి స్పందించారు ప్రధాని నరేరంద్ర మోడీ. 'సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్' నినాదమే గెలిపించింది.. భారత్ మళ్లీ గెలిచింది' అంటూ ట్వీట్ చేశారు నరేంద్ర మోడీ. మరోవైపు గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకుంది. గతంలో 282 సీట్లు గెలిచిన బీజేపీ... ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే ఆ సంఖ్య 336గా ఉన్న సంగతి తెలిసిందే.