చైనా అధ్యక్షుడికి మోడీ ఇస్తున్న కానుకలు ఇవే..!!

చైనా అధ్యక్షుడికి మోడీ ఇస్తున్న కానుకలు ఇవే..!!

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రధాని మోడీతో చర్చలు జరిపేందుకు ఇండియా వచ్చారు.  ఇండియాలోని మహాబలిపురంలో ఈ ఇరువురు నేతలు నిన్న సమావేశం అయ్యారు.  ఈరోజు కోవలంలో చర్చలు జరపబోతున్నారు.  ఈ చర్చల అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.  అనంతరం జింగ్ పింగ్ చెన్నై నుంచి తిరిగి చైనా వెళ్ళిపోతారు.  మోడీ చన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.  

అయితే, జిన్ పింగ్ కోసం మోడీ కొన్ని ప్రత్యేకమైన కానుకలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.  108 కేజీల బరువున్న రెండు దీపపు స్తంభాలను, మూడు అడుగుల ఎత్తున్న ఫోటోలను జిన్ పింగ్ కు బహుకరించనున్నారు.  సర్వస్వతి దేవి నృత్యం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోను చిత్రీకరించడానికి దాదాపు 45 రోజుల సమయం పట్టిందట.  తమిళనాడు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కానుకలు ఉండబోతున్నాయి.  అటు జిన్ పింగ్ కూడా మోడీ కోసం ప్రత్యేకంగా కానుకలు తీసుకొచ్చినట్టు సమాచారం.  ఆ కానుకలు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.