ఏపీకి లక్షా 40 వేల ఇళ్లు..

ఏపీకి లక్షా 40 వేల ఇళ్లు..

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ పేదలకు ఇచ్చే పక్కా గృహాలను కేంద్రం మంజూరు చేసింది. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ సాంక్షనింగ్ కమిటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మంజూరైన 6,28,488 గృహాలతో పీఎంఏవై కింద మంజూరైన ఇళ్లు ఇప్పటివరకు 60 లక్షల మార్కును దాటినట్టయింది. 

పక్కా గృహాల కోసం 11 రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాయి. రాష్ట్రాలవారీగా మంజూరైన ఇళ్ల వివరాలు ఇలా ఉన్నాయి...

యూపీ         2,34,879 
ఏపీ             1,40,559 
ఎంపీ            74,631
బిహార్          50,017
ఛత్తీస్ గఢ్     30,371
గుజరాత్       29,185
మహారాష్ట్ర     22,265
తమిళనాడు  20,794
ఒడిశా         13,421
త్రిపుర          9,778
మణిపూర్      2,588

ఇవన్నీ కలుపుకుంటే ఇప్పటివరకు 60,28,608 పక్కా గృహాలను కేంద్రం మంజూరు చేసినట్టయింది. ఇక వరదలతో దారుణంగా దెబ్బతిన్న కేరళకు రూ. 486.87 కోట్ల నిధులు మంజూరు చేశారు. అలాగే పీఎంఏవై పథకం కింద అర్హులైనవారితో పాటు వరదల్లో ఇళ్లు కోల్పోయినవారి సంఖ్యా వివరాలు సమర్పించాలని కేంద్రం సూచించింది.