నీరవ్ మోడీ, అతని సోదరి స్విస్ ఖాతాలు ఫ్రీజ్!!

నీరవ్ మోడీ, అతని సోదరి స్విస్ ఖాతాలు ఫ్రీజ్!!

పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ మోడీ, అతని సోదరికి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను స్విట్జర్లాండ్ లో ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల్లో వందల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. 

నీరవ్ మోడీ, అతని సోదరి పూర్వీ మోడీ ఖాతాలను స్విస్ అథారిటీ ఫ్రీజ్ చేసింది. వీటిలో సుమారుగా రూ.283.16 కోట్ల మొత్తం ఉంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి మేరకు స్విట్జర్లాండ్ ఈ చర్య చేపట్టింది. భారతీయ బ్యాంకుల నుంచి అక్రమ పద్ధతుల్లో ఈ ఖాతాల్లోకి మొత్తం బదలాయించినట్టు ఈడీ ఆరోపించింది. 

దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోడీ ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్నాడు. అతనిని మార్చిలో అరెస్ట్ చేయడం జరిగింది. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారిని ఇవాళ వీడియో లింక్ ద్వారా జైలు నుంచి లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో కస్టడీపై విచారణ కోసం హాజరు పరుస్తారు.