పోచారం ఏకగ్రీవ ఎన్నిక...

పోచారం ఏకగ్రీవ ఎన్నిక...

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలు ఎవరు చేపడతారు..? టీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపుతుంది? కాంగ్రెస్ తన అభ్యర్థిని పోటీకి పెడుతుందా? అనే ఉత్కంఠకు తెరపడింది... అసెంబ్లీ స్పీకర్‌ అభ్యర్థిగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక పోచారం తరఫున ఆరు ప్రతిపాదనలు సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేఖా నాయక్‌, అబ్రహం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారం చేసినా... స్పీకర్‌గా ఎవరిని పెట్టాలన్నదానిపై సుదీర్ఘ కసరత్తు చేశారు కేసీఆర్. టీఆర్ఎస్‌ అభ్యర్థిగా పోచారం నామినేషన్ దాఖలు చేయగా... ఇతర పక్షాలు మద్దతు తెలపడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.