తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు మాతృవియోగం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు మాతృవియోగం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి పరిగె పాపవ్వ (107) నిన్న రాత్రి 11 గంటలకు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాపవ్వకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. మొదటి కుమారుడు పోచారం శ్రీనివా్‌సరెడ్డి, రెండో కుమారుడు శంభురెడ్డి.