ఆకు కూరల్లో "పచ్చివిషం"

ఆకు కూరల్లో "పచ్చివిషం"

మనం తినే ఆకుకూరలు కూడా రోగ కారకాలవుతున్నాయి. ఎందుకంటే ఆకుకూరలకు పురుగుమందు కొట్టినప్పుడు వాటి మీద పేరుకుపోయిన అవశేషాలు మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలో  చేరిపోతున్నాయి. అయితే సమస్యేంటంటే.. ఆకుకూరల మీద పేరుకుపోయిన ఈ అవశేషాలు మానవ శరీరంలో దాదాపు 20 ఏళ్లు నిల్వ ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తాజా అధ్యయనంలో తేల్చింది. 

ఆకుల మీదుండే ఆర్గానో క్లోరిన్ అవశేషాలు తమిళనాడు రాష్ట్రంలో సగటున 9 శాతం ఉండగా.. తెలంగాణలో మాత్రం 9-30 శాతం దాకా ఉంటున్నాయని ఎన్ఐఎన్ హెచ్చరించింది. దీనివల్ల అనేక జబ్బులు వస్తాయని చెబుతోంది. హైదరాబాద్ లో నానాటికీ షుగర్ పేషెంట్ల సంఖ్య పెరగడానికి ఇదే కారణమని చెప్పింది. పాలకూర, గోంగూర, తోటకూర, క్యాబేజీ, బెండకాయ, వంకాయ వంటి వాటిని ఉప్పునీటిలో ఓ 10 నిమిషాలు ఉంచి (వీలైతే గోరువెచ్చని నీరు) ఆ తరువాత పరిశుభ్రమైన నీళ్లతో కడిగి వాడుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచించింది.