పోలీసుల అదుపులో బస్సు డ్రైవర్

పోలీసుల అదుపులో బస్సు డ్రైవర్

కర్నూలు వెల్దుర్తి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో గద్వాల జిల్లా రామవరం గ్రామంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. నిన్నటి వరకు మనతో తిరిగిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. తమ ప్రాణ మిత్రులను, బంధువులను తలచుకుంటూ బోరున విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. ఇంకొందరు హుటాహుటిన ఘటనా స్థలికి బయలుదేరి వెళ్లి అక్కడి విషయాలను గ్రామస్థులకు, బంధువులకు చేరవేశారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ జోసెఫ్ ను పోలీసులు అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించే క్రమంలో బస్సు డివైడర్ దాటి పక్కకు వెళ్లిందని తెలిపారు. బస్సు 52 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళుతుందని అన్నారు.