కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు ముమ్మరం..

కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు ముమ్మరం..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ కేస్‌లో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రెండు రోజుల నుంచి విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రిలో త్రిసభ్య కమిటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కమిటీ కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో కీలక నిందితుడు శ్రద్ధ ఆసుపత్రి అడ్మిన్ జేకే వర్మను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వర్మను రెండు రోజుల పాటు మహారాణిపేట పోలీసులు విచారించనునున్నారు. శ్రద్దా ఆసుపత్రి ఎండీ పరారీలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఢిల్లీ స్థాయిలో అధికారులతో మంతనాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తమవుతోంది. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదు పోలీసు బృందాలు ఈ కేసు విచారణలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.