చందానగర్ లో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ 

చందానగర్ లో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ 

హైదరాబాద్ చందానగర్ లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పోలీసుల కళ్లుగప్పి పలువురికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చందానగర్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రవీందర్ మాట్లాడుతూ.. బీహెచ్ఈఎల్ లోని ఎమ్ఐజీ ప్రాంతానికి చెందిన రాజేందర్ అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సంపాదన సరిపోకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ లోని తుని నుంచి చెన్నయ్య, ప్రదీప్ అనే వ్యక్తుల వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు. మంగళవారం బీహెచ్ఈఎల్, ఎమ్ఐజీల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో కారులో గంజాయి తరలిస్తుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఏడు లక్షల విలువైన 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ రవీందర్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సై హైమద్ బాషా, ఎఎస్ఐ నరసింహరెడ్డితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.