గోవిందరాజస్వామి కిరీటాల దొంగ దొరికాడు..

గోవిందరాజస్వామి కిరీటాల దొంగ దొరికాడు..

ఫిబ్రవరి 2న తిరుపతి గోవిందరాజస్వామి ఉప ఆలయంలో చోరికి గురైన కిరీటాల కేసును పోలీసులు చేధించారు. మంగళవారం తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా ఖాంధర్ కు చెందిన ఆకాశ్ గా నిర్ధారించామన్నారు. దొంగిలించిన మూడు కిరీటాలను కరిగించారని తెలిపారు. మూడు కిరీటాల కరిగించిన బంగారం 1350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితుడి నుంచి బంగారు కడ్డీలు, ఒక ఐఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు చోరీ చేసిన 3 కిరీటాలను కరిగించి బంగారు కడ్డీలుగా మార్చాడని తెలిపారు. చోరీకి గురైన 3 కిరీటాల బరువు 1381 గ్రాములని, వాటి విలువ సుమారు రూ.42 లక్షల 35 వేలని చెప్పారు. కేసు దర్యాప్తులో 237 సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన తరువాత నిందితుడి ఫోటో లభ్యమైందని అన్నారు. ఈ కేసు చేధించేందుకు 80 రోజులుగా 40 మంది పోలీసు సిబ్బంది శ్రమించారని అర్బన్ ఎస్పీ మీడియాకు తెలిపారు.