సీరియల్ కిల్లర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

సీరియల్ కిల్లర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

కేరళలో జాలీ అనే మహిళ తమ ఆరుగురు కుటుంబసభ్యులను హత్య చేసిన ఘటన మరువకముందే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ వ్యక్తి వరుస హత్యలకు పాల్పడ్డాడు. ఐదేళ్లలో ప్రసాదంలో విషం పెట్టి ఎనిమిది మంది ప్రాణాలను తీశాడు. ఎనిమిది వరుస హత్యలతో హడలెత్తించిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 16న పీఈటీ మాస్టర్ అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసాదంలో విషం కలిపి హత్యలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్థారణకు వచ్చారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ హత్యలు చేశాడు నిందితుడు. ఏలూరు హనుమాన్ నగర్‌కు చెందిన ఈ నిందితుడు తన బంధువులు, పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని పూజల పేరిట నమ్మించేవాడు. తన బందువులనే హంతకుడు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కేసును గుట్టు చప్పుడు కాకుండా విచారిస్తున్నారు పోలీసులు.