దుర్గ ఆలయ చైర్మన్ కు ఘోర అవమానం

దుర్గ ఆలయ చైర్మన్ కు ఘోర అవమానం

బెజవాడ ఇంద్రకీలాద్రి ఆలయ చైర్మన్ గౌరంగబాబుకు మరోసారి ఘోర అవమానం జరిగింది. శనివారం రాత్రి ఒంటి గంటకు దసరా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి చైర్మన్ గౌరంగబాబు తన కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం మరలా కొండపైన తన కార్యాలయంలోకి వెళుతుండగా గేట్లకు తాళాలు వేసి తీయకుండా మళ్ళీ అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై చైర్మన్ గౌరంగబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసారు. పోలీసుల తీరుకు నిరసనగా‌ తన కార్యాలయంకు వెళ్ళకుండానే గౌరంగబాబు వెనుదిరిగగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పాలకమండలి చైర్మన్ నే పంపకుండా అడ్డుకుంటే సామాన్య భక్తులను ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుస్తోంది. సమావేశాల్లో ఒకలాగా ఇక్కడ మరోలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జరిగిన అవమానంను సీపీ దృష్టికి తీసుకువెళతాను అని గౌరంగబాబు తెలిపారు.