బంగారాన్ని దోపిడీ చేశారిలా..

బంగారాన్ని దోపిడీ చేశారిలా..

హైదరాబాద్ నగర శివారు అమీన్ పుర్ లో జరిగిన జ్యూవలరీ షాప్ దోపిడి కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. బిహర్ కు చెందిన భార్యభర్తలుగా గుర్తించారు. భార్య కిడ్నీ వ్యాధి తో భాదపడటంతో కొద్ది నెలల క్రితమే ఆపరేషన్ జరిగింది. దీనికి మొత్తం ఖర్చు 7లక్షలు రూపాలయలు ఖర్చు అవ్వడంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు నగల దుకాణంలో దోపిడికి ప్లాన్ చేశారు. ఎవ్వరికి అనుమానం రాకుండా వారం రోజుల పాటు ఆ ప్రాంతంలో రెక్కిని నిర్వహించారు. ముఖానికి బురఖా  ధరించి జ్యూవలరీ షాప్ లోకి  చోరబడిన దుండగులు డమ్మి తుపాకితో యజమాని బెదిరించారు. దాడి చేసి మరి బంగారు నగలు, వెండితో ఉడాయించారు. పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులను కోల్ కత్తా సమీపంలో అరెస్ట్ చేశారు.