కేటీఆర్ పీఏలం అంటూ మోసాలు...ఇద్దరి అరెస్ట్

కేటీఆర్ పీఏలం అంటూ మోసాలు...ఇద్దరి అరెస్ట్


మంత్రి కేటీఆర్ పీఏ అని చెబతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదారబాద్‌ మల్కాజిగిరికి చెందిన కార్తికేయ, ఫెడ్రిక్‌ ఇద్దరు స్నేహితులు. వీరు గత కొంతకాలంగా కేటీఆర్‌ పీఏ పేరు చెప్పి ప్రభుత్వ సిబ్బందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈక్రమంలోనే శ్రీరాములు అనే వ్యక్తి వీరిని సంప్రదించాడు. తన కొడుకు వైద్యానికి సాయం చేయాలని కోరాడు. దీంతో వారు ఫేక్‌ పత్రాలు ఇచ్చి వైద్యం చేయించు కోవాలన్నాడు. ఆస్పత్రిలో ఇవ్వగా అవి నకిలీవని తేలింది. దీంతో కేసు నమోదు చేసిన ఘట్ కేసర్ పోలీసులు మల్కాజిగిరి ఎస్.వో.టి సహాయంతో ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నారు. గతంలో కూడా కార్తికేయ పై నల్గొండ 1టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇదే కేసు నమోదు అయినట్లు మల్కాజిగిరి డి.సి.పి రక్షిత మూర్తి తెలిపారు. నిందితులు వద్ద నుంచి 1 లక్ష 75వేలు నగదు, 3 మొబైల్ ఫోన్స్ మరియు ముఖ్యమంత్రి కార్యాలయం యొక్క ఫేక్ పత్రాలను స్వాదీనం చేసుకుని నిందితులను రిమాండ్ కి తరలిస్తునట్లు తెలిపారు.