హుజూర్‌నగర్ బైపోల్.. ఉత్తమ్‌పై కేసు

హుజూర్‌నగర్ బైపోల్.. ఉత్తమ్‌పై కేసు

ఓ వైపు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.. పాలక, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి తన నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టారన్న అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా ఉత్తమ్ హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఉన్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు గులాబీ పార్టీ నేతలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోదాడ నియోజకవర్గ ఓటరని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడు ఉల్లగించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.