సాహో నిర్మాతలను ఇరుకున పెడుతున్న బ్యాగులు.!!

సాహో నిర్మాతలను ఇరుకున పెడుతున్న బ్యాగులు.!!

సాహో సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ అయ్యి మంచి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.  తెలుగులో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. బాలీవుడ్లో మాత్రం ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.  అక్కడ డిస్ట్రబ్యూటర్లకు మంచి లాభాలు వచ్చాయి.  ఇదిలా ఉంటె, ఈ సినిమా నిర్మాతలపై బెంగళూరుకు చెందిన ఔట్ షైనీ అని బ్యాగుల తయారీ సంస్థ కేసు ఫైల్ చేసింది.  

తమ కంపెనీకి సంబంధించిన బ్యాగులను సినిమాలో హీరో, హీరోయిన్లు వాడే విధంగా చూస్తామని, ఈ బ్యాగ్ లకు ప్రచారం కలిగిస్తామని చెప్పి తమ వద్ద నుంచి రూ.1.38 కోట్ల రూపాయలు నిర్మాతలు తీసుకున్నారని, ఆ బ్యాగ్ లను సినిమాలో వాడలేదని, ప్రచారం కూడా కల్పించలేదని చెప్పి పోలీస్ కేసు పెట్టారు.  హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఫైల్ అయ్యింది.  దీనిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.