ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు..

ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు..

ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులపై కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  ఏపీ ఓటర్ల సమాచారం లీకైందని తాను తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారని లోకేశ్వర్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆయన అన్నారు.