మరోసారి చిక్కుల్లో పడిన కంగన.. పోలీస్ కేస్ !

మరోసారి చిక్కుల్లో పడిన కంగన.. పోలీస్ కేస్ !

బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ చుట్టూ ఎప్పుడూ వివాదాలు ఉంటూనే ఉంటాయి.  ఏదో ఒక విషయంలో ఆమె తరచూ వార్తల్లో నానుతూనే ఉంటారు.  తాజాగా ఆమెకు ముంభై పోలీసులు సమన్లు పంపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

వివరాల్లోకి వెళితే గత ఏడాది కంగనా 20 కోట్లు పెట్టి ఒక బంగ్లాను కొనుగోలుచేసింది.  ఈ డీల్ సెట్ చేసినందుకుగాను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కు ఆమె పెర్సెంటేజ్ చెల్లించాల్సి ఉంది.  ఇప్పటికే ఆమె 20 కోట్లలో ఒక శాతం అనగా 20 లక్షలు చెల్లించారు.  కానీ బ్రోకర్ మాత్రం తనకు 2 శాతం పెర్సెంటేజ్ రావాల్సి ఉందని, కానీ కంగనా మిగిలిన 1 శాతం చెల్లించడంలేదని పోలీసులకు పిర్యాధు చేశారు.  దీంతో ఖర్ పోలీస్ స్టేషన్ నుండి ఆమెకు సమన్లు జారీ అయ్యాయి.  దీనిపై స్పందించిన కంగనా మాత్రం కొనుగోలు సమయంలో 1 శాతం మాత్రమే పెర్సెంటేజ్ మాట్లాడుకొన్నామని, ఆ మొత్తాన్ని ఎప్పుడో చెల్లించానని, అందుకు తగిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడ ఉన్నాయని చెప్పుకొచ్చారు.