పెళ్లి చేసుకోమందని చంపేశాడు !

పెళ్లి చేసుకోమందని చంపేశాడు !

సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్  పోలీసులు ఛేదించారు.  మొదటి నుండి అనుమానిస్తున్నట్టే ఆమె ప్రియుడే సునీల్ ఆమెను హాత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.  గత కొన్నాళ్లుగా లావణ్య తనను పెళ్లి చేసుకోవాలని సునీల్ పై ఒత్తిడి పెంచింది.  దాంతో కోపగించుకున్న అతడు మస్కట్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఇంట్లోంచి తీసుకెళ్లాడు. 

శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి హత్యచేసి మృతదేహాన్ని లగేజ్ బ్యాగులో కుక్కి సురారం కాలువలో పడేశాడు.  గతంలో మూడుసార్లు ఆమెపై హత్యాయత్నం చేసినా అవి విఫలం కావడంతో ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోంచి తీసుకొచ్చి హత్య చేసినట్టు సునీల్ పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు.