పోలీసులను టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్ళు !

పోలీసులను టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్ళు !

రెండు రాష్ట్రాల పోలీసులకు సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. పోలీసుల పేరు చెప్పి ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.  రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో సైబర్ నేరగాళ్ల పై కేసులు నమోదు అయ్యాయి. పోలీస్ అధికారుల ఫోటోలే పెట్టుబడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు చీటర్స్.  ముఖ్యమైన పోలీస్ స్టేషన్లు, అధికారుల పేర్లతో మెసెంజర్ లో రిక్వెస్ట్ పెడుతున్నారు. పోలీసుల ప్రొఫైల్ ఫోటో లతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి స్నేహితులను డబ్బులు పంపాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.

ఎస్సై ల నుండి ఎస్పీ ల ప్రొఫైల్స్ వరకు నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వారు చెప్తున్న గూగుల్ పే నెంబర్ ఆధారంగా ఒరిస్సా, రాజస్తాన్ నుండి చేస్తున్నట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది పోలీస్ ల ప్రొఫైల్స్ ను ఫేక్ చేసిన కేటు గాళ్ళు గట్టిగానే దండు కున్నారు. పోలీసుల పేరుతో డబ్బులు రిక్వెస్ట్ పెట్టేవాడిని నమ్మవద్దని, పోలీసులు ఎవరు కూడా ఇలా డబ్బులు అడగరని, సోషల్ మీడియాలో సహాయం చేయాలని పోలీసులు పెడుతున్న రిక్వెస్ట్ ఎవరూ స్పందించ వద్దని పోలీసులు చెబుతున్నారు.