చైన్ స్నాచింగ్ కు వాడిన బైక్ స్వాధీనం

చైన్ స్నాచింగ్ కు వాడిన బైక్ స్వాధీనం

హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో జరిగిన వరుస చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు వాడిన బైక్ ను పోలీసులు గుర్తించారు. మలక్‌పేటలో ద్విచక్రవాహనాన్ని అద్దెకు తీసుకుని చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు నిర్ధారించారు. నిన్న ఉదయం చైతన్యపురి, వనస్థలిపురం, హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ ల పరిధిలో చోరీ చేసి, తిరిగి బైక్ ను మలక్ పేటలో అప్పగించి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. తలాబ్ కట్టా ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో బైక్ నెంబర్ ఆధారంగా ఈ విషయాలు బయటపడ్డాయి. బైక్ అద్దెకిచ్చిన యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చైన్ స్నాచర్లు తమ పని ముగించుకుని బైక్ ను అప్పగించిన తరువాతే యజమాని వేరే వ్యక్తులకు అద్దెకిచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.