పులివెందులలో భారీగా పోలీసుల మోహరింపు..!

పులివెందులలో భారీగా పోలీసుల మోహరింపు..!

కడప జిల్లా పులివెందులకి భారీగా పోలీసు బలగాలను తరలిస్తున్నారు ఉన్నతాధికారులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో ముందస్తుగా భారీగా బలగాలను మోహరించారు. రేపు వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందస్తుగా అప్రమత్తమయ్యారు పోలీసులు. ఒక మరోవైపు అమరావతి నుంచి పులివెందులకు బయల్దేరి వెళ్లారు ఫోరెన్సిక్ నిపుణులు, ఫింగర్ ప్రింట్‌ఎక్స్‌పర్ట్స్‌, సైబర్ ఎక్స్‌పర్ట్స్. ఇక వివేకా హత్య సమయంలో ఆ పరిధిలోని టవర్ లోకేషన్‌లో కాల్స్ డేటాని పరిశీలిస్తున్నారు పోలీసులు. కర్నూల్ రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్, అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతి రాణాను పులివెందుల వెళ్లాలని డీజీపీ ఆదేశించారు.