శ్రీనివాస్ రెడ్డి తీరుతో అధికారులకు తలనొప్పి

శ్రీనివాస్ రెడ్డి తీరుతో అధికారులకు తలనొప్పి

హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి తీరు సిట్ అధికారులకు తలనొప్పిగా మారింది. బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారుల బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు ఎన్ని విధాల ప్రయత్నించినా నిందితుడు నోరుమెదపడం లేదని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. మరోవైపు హాజీపూర్‌లో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు పూర్తి చేసినట్టు సమాచారం. గ్రామస్తులు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో రాత్రి సమయంలోనే సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసినట్టు తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ఫోన్‌లో ఉన్న సమాచారంతోపాటు, కాల్‌ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 13 వరకు శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారులు విచారించనున్నారు.