లండన్‌లో మరో జార్జి ప్లాయిడ్..!

లండన్‌లో మరో జార్జి ప్లాయిడ్..!

నల్ల జాతీయుడు జార్జి ప్లాయిడ్ ఉందంతం మరవకముందే అలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. లండన్‌లోని ఇస్లింగ్‌టన్‌ ప్రాంతంలో ఓ నల్లజాతీయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి మెడపై మోకాలితో తొక్కి పట్టారు. అతడు ఎంత వేడుకున్నప్పటికీ విడిచిపెట్టలేదు. ఈ వీడియో బయటకు రావటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఘటనపై డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ సర్‌ స్టీవ్‌ హౌస్‌ విచారం వ్యక్తం చేశారు. అంతే కాకుండా వీడియో లో ఉన్న ఒక అధికారిని సస్పెండ్‌ చేశారు. మరో అధికారిని విధుల నుండే తప్పించారు. అయితే నల్లజాతీయుడు బహిరంగ ప్రదేశంలో కత్తితో తిరుగుతున్నాడని అందుకే అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.