ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పై బదిలీ వేటు

ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పై బదిలీ వేటు

ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి పై బదిలీ వేటు పడింది. కోస్టల్ బ్యాంకు ఎండి జయరామ్ హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డి తో టచ్ లో ఉండటంపై అధికారులు విచారణ జరిపారు. రాకేష్ రెడ్డితో ఏసీపీ మల్లారెడ్డి సాన్నిహిత్యం, పదే పదే మాట్లాడిన కాల్స్ ను డీకోడ్ చేసారు.  ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలపై పూర్తి నిర్దారణకు వచ్చాకే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ ఏసీపీ గా గాంధీ నారాయణను నియమించారు.