మండపేట చర్చ్ పై దాడి..విచారణలో కీలక ఆధారాలు..!

  మండపేట చర్చ్ పై దాడి..విచారణలో కీలక ఆధారాలు..!

కొంతమంది దుండగులు చర్చిలో మేరీ మాత , చైల్డ్ జీసస్ మరియు యేసు విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన పై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసారు. మండపేటలో ఆర్‌సిఎం చర్చిలో జరిగిన ఘటనకు సంబంధించి సిసిటివి ఫుటేజీని చర్చి నిర్వాహకులు పోలీసులకు  అందజేశారు. కాగా ఆ సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. వీడియోలో ఒక దుండగుడు విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని పోలీసులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ ను ఉపయోగించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకోవడానికి సిసిటివి ఫుటేజీని పోలీసులు  పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే 20మంది నిందితులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత కొన్ని నెలల నుండి కొంతమంది గుర్తు తెలియని దుండగులు హిందూ దేవాలయాలు మరియు ఇతర మత దేవాలయాలపై దాడులు చేస్తూ రాష్ట్రంలో మత ఘర్షణలకు పాల్పడుతున్నారు.