హీరో గోల్డ్‌ ఆఫీసులో సోదాలు...

హీరో గోల్డ్‌ ఆఫీసులో సోదాలు...

సంచలనం రేకెత్తించిన హీరో గోల్డ్ కేసులో మరొక అడుగు ముందుకు పడింది... ఈ కేసులో మొదటి సారిగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు... కొద్దిసేపటి క్రితమే ఈ సోదాలు మొదలయ్యాయి. బంజారాహిల్స్‌లోని హీరో గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. హీరో గోల్డ్ లోకి వచ్చిన డిపాజిట్ల వ్యవహారాన్ని తేల్చేందుకు సోదాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే హీరా గోల్డ్ తన డిపాజిట్‌దారుల వివరాలు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది... దాదాపు రూ.900 కోట్ల డిపాజిట్లు ఎలా వచ్చాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. దాదాపు 16 రాష్ట్రాల్లో డిపాజిట్లు  సేకరించింది హీరో గోల్డ్... అతి తక్కువ కాలంలోనే రూ.6 వేల కోట్ల టర్నోవర్ చూపించింది హీరో గోల్డ్... హీరా గోల్డ్ పెట్టుబడులు మొత్తం హవాలా డబ్బులుగా పోలీసులు అనుమానిస్తున్నారు... ఇప్పటి వరకు 43 ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది.