తిరుపతిలో నకిలీ నోట్ల కలకలం..

తిరుపతిలో నకిలీ నోట్ల కలకలం..

తిరుపతి నగరంలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి... నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న పదిమంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు... అనంతపురంకు చెందిన వ్యక్తుల దగ్గర డైమండ్స్ కొని నకిలీ నోట్లు ఇస్తూ తిరుపతి అర్బన్ పోలీసులు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు తీగ లాగారు... పది లక్షల నకిలీ నోట్లు, ఐదు లక్షలు విలువైన 14 డైమండ్స్, నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న రెండు ల్యాప్‌టాప్‌లు... నోట్లు ముద్రణకు ఉపయోగించే రెండు ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నారు.