పొట్లూరి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

పొట్లూరి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ వైసీపీలో చేరిన తరువాత జిల్లాకు వస్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆయన అభిమానులు జగ్గయ్యపేట నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. పొట్లూరి ర్యాలీకి అనుమతి లేదంటూ జగ్గయ్యపేట పోలీసులు 20 కార్లను సీజ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. చిల్లకల్లు పోలీసుస్టేషన్ ముందు పొట్లూరి వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఆందోళనకు దిగారు.