లలితా జ్యువెలరీ కేసు...యువ నటితో శ్రీలంక జంపయిన దొంగ !

లలితా జ్యువెలరీ కేసు...యువ నటితో శ్రీలంక జంపయిన దొంగ !

లలితా జ్యుయెలరీ దోపిడీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు రూ. 10 కోట్ల విలువైన నగలతో పాటు, ఓ తమిళ యువ నటిని వెంటేసుకుని శ్రీలంకకు పారిపోయినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 2వ తేదీన దొంగతనం జరిగి రూ. 13 కోట్ల విలువైన ఆభరణాలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే మణికంఠన్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి, 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితునిగా భావిస్తున్న  తిరువారూర్ కు చెందిన మురుగన్ మాత్రం ఇంకా దొరకలేదు.

అతను హెచ్ఐవీతో బాధపడుతున్న రోగి అని కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఇతని వలలో సదరు నటి ఎలా పడిందన్న విషయం మాత్రం తెలియడం లేదు. మురుగన్ సినిమా నిర్మాతగా మారి బ్యాంకుల్లో దొంగతనానికి పాల్పడి ఆ డబ్బుతో సినిమాలు నిర్మించేవాడని అంటున్నారు. బాలమురుగన్ ప్రొడక్షన్ పేరుతో కొన్ని చిన్న సినిమాలు నిర్మించాడట మురుగన్.  తెలుగులో ‘మనసా వినవే’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. అందులో తన అక్క కుమారుడు సురేశ్‌ను నటింపజేశాడు.

లలితా జ్యూవెలరీ చోరీ కేసులో పోలీసులు గాలిస్తున్న సురేశ్‌ ఇతనే. ఆ చిత్రం 70% నిర్మాణం పూర్తయ్యాక ఓ చోరీకేసులో చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీసులు 2016 ఫిబ్రవరిలో మురుగన్‌ను అరెస్టుచేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ‘ఆత్మ’ అనే మరో చిత్ర నిర్మాణం మొదలుపెట్టాడు. అంతేకాకుండా దొంగతనాల ద్వారా వచ్చిన డబ్బును సొంతూరు తిరువారూర్ లో దానధర్మాలకూ వెచ్చించేవాడని తెలుస్తోంది.  అందువల్ల అతడి గురించి పోలీసులకు ఆ గ్రామస్థుల నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని అంటున్నారు.