మూడేళ్ల పాపపైకి దూసుకెళ్లిన పోలీస్ వాహనం..

మూడేళ్ల పాపపైకి దూసుకెళ్లిన పోలీస్ వాహనం..

యాదాద్రిలో పోలీసు వాహనం బీభత్సం సృష్టించింది. యాదగిరిగుట్ట పాత నరసింహ స్వామి టెంపుల్ దగ్గర దైవ దర్శనం చేసుకుని తన కుటుంబసభ్యులతో కలిసి నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారి ప్రణతిపైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. ప్రణతి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ప్రణతి తరించారు. మూడేళ్ల చిన్నారి ప్రణతిపైకి దూసుకెళ్లిన వాహనం రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన టీఎస్ 09 పీఏ 5508 నంబర్‌ కలిగిన పెట్రోలింగ్ వాహనంగా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.