ఉపాసనకు కుష్బూ సపోర్ట్.. 

ఉపాసనకు కుష్బూ సపోర్ట్.. 

ఇటీవలే ప్రధాని మోడీ అయన నివాసంలో చేంజ్ విత్ ఇన్ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులు, టివి ఆర్టిస్టులు హాజరయ్యారు.  గాంధీ ఆశయాల గురించి, ఎలా వాటిని నెరవేర్చాలి అనే విషయాలపై చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం బాలీవుడ్ నటీనటులు అంతా ప్రధాని మోడీతో కలిసి ఫోటోలు దిగారు.  సల్మాన్ ఖాన్ వంటి హీరోలు అందుబాటులో లేకపోవడంతో హాజరు కాలేదు.  దీనిపై ఉపాసన తన అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  

నటీనటులంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని, సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఉందని, సౌత్ స్టార్స్ కు కూడా ఆహ్వానం పంపితే బాగుండేదని అంటూ ట్వీట్ చేసింది.  దీనిపై తాజాగా కుష్బూ కూడా స్పందించింది.  ప్రభుత్వానికి బాలీవుడ్ ఒక్కటే ఆదాయం తీసుకురావడం లేదని, సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆదాయం వస్తోందని, సౌత్ స్టార్స్ ను కూడా ఆహ్వానించి ఉంటె ఇంకా బాగుండేదని పేర్కొన్నది.