రేపే చివరి దశ ఎన్నికలు, గురువారం కౌంటింగ్

రేపే చివరి దశ ఎన్నికలు, గురువారం కౌంటింగ్

లోక్ సభ ఎన్నికల్లో చివరి దశ ఎన్నికలు రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి. మిగిలిన 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న ప్రారంభమై సుదీర్ఘంగా 39 రోజులు కొనసాగిన మొదటి ఆరు దశల్లో 483 సీట్లకు ఓటింగ్ పూర్తయింది. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. ఆదివారం ఎన్నికల్లో 10 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని పోటీలో నిలిచిన 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ లో ఏడో దశ ఎన్నికలు జరుగుతాయి. 2014 ఎన్నికల్లో ఈ 59 సీట్లకు బీజేపీ 33 స్థానాలను గెలుచుకొంది. ఏడో దశ ఎన్నికల విశేషాలు ఇలా ఉన్నాయి.

లోక్ సభ ఎన్నికలు 2019- ఏడో దశ (మే 19, 2019)

7రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 సీట్లు కలుపుకొని మొత్తం 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సీట్లలో గత ఎన్నికల్లో పార్టీలు గెలుచుకొన్న వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్ 8-బీజేపీ 5, ఆర్ఎల్ఎస్పీ 2, జెడియు 1
చండీగఢ్ 1-బీజేపీ 1
హిమాచల్ ప్రదేశ్ 4-బీజేపీ 4
ఝార్ఖండ్ 3-బీజేపీ 1, జెఎంఎం 2
మధ్యప్రదేశ్ 8-బీజేపీ 8
పంజాబ్ 13-ఆప్ 4, బీజేపీ 2, కాంగ్రెస్ 3, అకాలీదళ్ 4
ఉత్తరప్రదేశ్ 13-అప్నాదళ్ 1, బీజేపీ 12
పశ్చిమ బెంగాల్ 9-తృణమూల్ కాంగ్రెస్ 9
మొత్తం 59-ఆప్ 4, అప్నాదళ్ 1, తృణమూల్ కాంగ్రెస్ 9, బీజేపీ 33, ఆర్ఎల్ఎస్పీ 2, కాంగ్రెస్ 3, జెడియు 1, జెఎంఎం 2, అకాలీదళ్ 4

మొత్తం అభ్యర్థులు 918
మొత్తం ఓటర్లు 10.02 కోట్లు
పురుష ఓటర్లు 5.27 కోట్లు
మహిళా ఓటర్లు 4.75 కోట్లు
ఇతరులు 3,435
పోలింగ్ కేంద్రాలు 1,12,986