అర్ధరాత్రి వరకూ ఏపీలో పోలింగ్‌..!

అర్ధరాత్రి వరకూ ఏపీలో పోలింగ్‌..!

ఆంధ్రప్రదేశ్‌లో అర్ధరాత్రి వరకూ కొన్ని చోట్ల పోలింగ్‌ కొనసాగింది. రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షించిన గుంటూరుజిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేటలోని పోలింగ్‌ బూత్‌లో రాత్రి 11 గంటలకు ముగిసింది. గాజువాకలోని 58 వ వార్డు 129 బూత్‌లో రాత్రి 11:45 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. గుంటూరుజిల్లా తెనాలి పట్టణంలోని నందులపేటలో 117 పోలింగ్‌ బూత్‌లో అర్ధరాత్రి వరకూ పోలింగ్‌ కొనసాగించారు. మొత్తమ్మీద.. ఎన్నడూలేని విధంగా రాత్రి 10:30 గంటల వరకూ 139 కేంద్రాలులో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. 11 గంటల వరకూ 70 కేంద్రాలు, 11:30 గంటల తర్వాత 49 కేంద్రాల్లో ఓటింగ్‌ కొనసాగింది. అర్ధరాత్రి 12 గంటలు దాటాక కూడా 23 కేంద్రాల్లో, 12.30 దాటాక 14 కేంద్రాల్లో ఓటింగ్‌ జరిగింది. వేల సంఖ్యలో ఈవీఎంలు మోరాయించడంతో ఓటింగ్‌ ప్రక్రియ బాగా ఆలస్యమైంది.