3గంటల వరకు పోలింగ్ శాతం 46.52

3గంటల వరకు పోలింగ్ శాతం 46.52

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం కొనసాగుతున్న ఆరో విడత ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ 46.52 శాతంగా నమోదైంది. బీహార్‌లో 43.86, హర్యాణాలో 47.57, మధ్యప్రదేశ్‌లో 48.53, ఉత్తర్‌ప్రదేశ్‌లో 40.96, పశ్చిమ బెంగాల్‌లో 63.09, ఝార్ఖండ్‌లో 54.09, ఢిల్లీలో 36.73 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ ముగిసే సమయానికి కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు గానూ ఆరో దశలో ఎన్నికలు కొనసాగుతున్నాయి.