మధ్యాహ్నం 3గంటలకు 44.67 శాతం పోలింగ్

మధ్యాహ్నం 3గంటలకు 44.67 శాతం పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగుతున్న తుది విడత ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంట వరకు మొత్తం 44.67 శాతం పోలింగ్‌ నమోదైంది. బీహార్‌లో 38.80, హిమాచల్‌ ప్రదేశ్‌లో 46.21, మధ్య ప్రదేశ్‌లో 48.21, పంజాబ్‌లో 43.15, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 40.20, పశ్చిమ బెంగాల్‌లో 52.47, జార్ఖండ్‌లో 56.40 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. చివరి విడత పోలింగ్‌లో భాగంగా చండీగఢ్‌ సీటుతో పాటు ఉత్తరప్రదేశ్‌(13), పంజాబ్‌(13), పశ్చిమబెంగాల్‌(9) బీహార్‌(8), మధ్యప్రదేశ్‌(8), హిమాచల్‌ప్రదేశ్‌(4), జార్ఖండ్‌(3) రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. కాగా ఎన్నికల తుది ఫలితాలు మే 23న వెల్లడికానున్నాయి.