చంద్రగిరిలో 3గంటలకు 67.55 శాతం పోలింగ్

చంద్రగిరిలో 3గంటలకు 67.55 శాతం పోలింగ్

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గం రీపోలింగ్ లో మధ్యాహ్నం 3గంటల వరకు 67.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం ఈ కేంద్రాల్లో రీపోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు పాకాల మండలం పులివర్తిపల్లి, కుప్పంబాదురు, రామచంద్రాపురం మండలంలోని ఎన్.ఆర్‌.కమ్మపల్లి, కమ్మపల్లి, కొత్తకండ్రిగ, వెంకటరామపురం, కాళేపల్లిలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రత కల్పించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 250 మంది పోలీసులు, ఒక ఐపీఎస్‌ స్థాయి అధికారి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.