పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

తెలంగాణలో పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది.  రేపటి నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను ఈ నెల 17కు వాయిదా వేశామని  కన్వీనర్ నవీన్ మిట్టల్‌ చెప్పారు.  

సవరించిన షెడ్యూల్..

  • 17 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్
  • 18 నుంచి 21 వరకు ధ్రువపత్రాల పరిశీలన
  • 18 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు
  • 25న అభ్యర్థులకు పాలిటెక్నిక్ సీట్లు కేటాయింపు
  • 25 నుంచి 28వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, కళాశాలలకు రిపోర్టు చేయాలి
  • జూన్ 1 న తరగతులు ప్రారంభం