'టికెట్‌ రాకపోయినా టీఆర్‌ఎస్‌లోనే ఉంటా..'

'టికెట్‌ రాకపోయినా టీఆర్‌ఎస్‌లోనే ఉంటా..'

టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నానన్న వార్తలో నిజం లేదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలో పార్టీ కార్యకర్తలతో ఇవాళ ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ వచ్చినా రాకపోయినా పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.