ప్రధాని ప్రసంగం సినిమా స్క్రిప్ట్ ను తలపించింది

  ప్రధాని ప్రసంగం సినిమా స్క్రిప్ట్ ను తలపించింది

అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడిన తీరు సినిమా స్క్రిప్ట్ ను తలపించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగం ఎన్నికల సభలో మాట్లాడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని అంతా మేమే చేశామన్నట్లు ప్రసంగించారని మండిపడ్డారు. మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ పరిణతి చెందిన నాయకుడిలా సమస్యలపై మాట్లాడరని, అనంతరం ప్రధాని దగ్గరకు వెళితే అహంభావంతో లేకుండా ఉండిపోయారని ఆరోపించారు. లేస్తే ఎక్కడ రాహుల్ తన సీట్లో కూర్చుంటారని ప్రధాని భయపడినట్టుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాని ఇంటి ముందు కోట్లాడి...ఇంటి వెనక దోస్తీ చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమస్యల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిణతితో వ్యవహరించిందని ప్రశంసించడంతో కేసీఆర్ ఆనందంగా ఉన్నారని అన్నారు.