కాంగ్రెస్ నాయకుల వల్లే ఓడిపోయాం

కాంగ్రెస్ నాయకుల వల్లే ఓడిపోయాం

తెలంగాణ ఎన్నికల్లో కొంత మంది కాంగ్రెస్ నాయకుల వల్లే ఓడిపోయాం అని ఏపీ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహాకూటమిగా తెలంగాణ ఎన్నికల్లో ముందుకుపోయాం. అయినా కూడా మేము ఓటమి చెందాం.. దీనికి చాలా బాధపడుతున్నాం. టీఆర్ఎస్ కంటే చాలా బాగా ప్రచారం చేసినా ఓడిపోయాం.. ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావట్లేదు. ఓడడానికి ఎన్నో కారణాలున్నా.. రాష్ట్ర అధిష్టానం అన్ని లోపాలను సరిదిద్దుకోవాలన్నారు. మిగితా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఆనందంగా ఉంది. అధికారం చేపట్టిన ఒక సంవత్సరంలో రాహుల్ ఇలాంటి విజయాలు సాధించడం మంచి పరిణామం. మరిన్ని విజయాలు కూడా సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎవరైనా ఓటమికి తప్పని సరిగా బాధ్యత వహించాల్సిందే అని పొంగులేటి అన్నారు. రాహుల్ గాంధీని కలిసి చర్చిస్తా అని తెలిపారు. రాహుల్ గాంధీ గారు రంగంలోకి దిగాల్సిందే అన్నారు. మరింత  సమాచారం కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.