పొన్నాల ఇంట విషాదం...

పొన్నాల ఇంట విషాదం...

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ అధ్యక్ష్యుడు పొన్నాల లక్ష్మయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మయ్య సోదరి మనవడు దృపత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బైక్ పై ప్రయాణిస్తున్న ఆయన గచ్చిబౌలి పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద రోడ్ డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దృపత్ తలకు బలమైన గాయం అయింది. ఆ గాయం వలన ఆయన అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పొన్నాల లక్ష్యయ్య హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. దృపత్ మృతితో పొన్నాల కుటుంబంలో విషాదం నెలకొంది. నిండా పాతికేళ్ళు కూడా నిండని యువకుడి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దృపత్ ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. దృపత్ వయసు 22 సంవత్సరాలు.