ఇక ఆయన కూడా పిల్లిలా బతకాల్సిందే... 

ఇక ఆయన కూడా పిల్లిలా బతకాల్సిందే... 

బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిందని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో దానం నాగేందర్ ని హోంమంత్రి ల్యాండ్ గ్రాబర్ అన్నారు. అలాంటి ల్యాండ్ గ్రాబర్ ని ఎందుకు టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. దీనికి టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ కు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా జన్మను ఇస్తే అలాంటి కాంగ్రెస్ నే విమర్శిస్తారా? అంటూ దానం ప్రశ్నించారు. మేమంతా బీసీ నేతలమేనని.. కాంగ్రెస్ లో చాలా సంతోషంగా ఉన్నామని.. బీసీలకు టీఆర్ఎస్ ఏం చేసిందో.. ఎంత బడ్జెట్ రిలీజ్ చేసిందో చెప్పాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన దానం, డీఎస్, కేకే వలెనే ఇక పిల్లిలా బ్రతకాల్సిందేనని ఎద్దేవా చేశారు.