బాహుబలి తరహాలో ఆ మూవీ..

బాహుబలి తరహాలో ఆ మూవీ..

రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే హిట్ కొట్టింది.  ఇప్పుడు ఇదే బాటలో మరో సినిమా రాబోతున్నది.  స్టార్ దర్శకుడు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు.  ఈ సినిమాలో అమితాబ్, విక్రమ్, విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాయ్, జయం రవి, అనుష్క, కీర్తి సురేష్ తదితరులు నటిస్తున్నారు.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  

ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నాడు మణిరత్నం.  అందులో మొదటిపార్ట్ 2021 లో రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా రిలీజైన కొన్ని నెలలకు సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేస్తారట.  రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి మణిరత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.  ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.