అమ్మ పూజా.. గట్టిగానే లాగావ్ !
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా 'మహర్షి'. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కావడం, మహేష్ హీరోగా చేస్తుండటంతో నిర్మాతలకు ఎక్కువ డేట్స్ ఇచ్చింది పూజా. అందుకు తగ్గట్టుగానే రెమ్యునరేష్ కూడా భారీస్థాయిలోనే వసూలు చేసిందట. సినీ వర్గాల టాక్ మేరకు ఈ చిత్రం కోసం ఈమె సుమారు ఒకటిన్నర కోటి వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. వరుస విజయాలతో ఉన్న స్టార్ హీరోయిన్లకు సైతం ఇంత భారీ మొత్తం దక్కడం అరుదే. అలాంటిది పూజా అందుకుందంటే విశేషమే మరి. దిల్ రాజు, అశ్విని దత్, పివిపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదలకానుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)