మాటల మాంత్రికుడితో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న బుట్టబొమ్మ?

మాటల మాంత్రికుడితో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న బుట్టబొమ్మ?

బుట్టబొమ్మ పూజ హెగ్దె టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ తన హవా నడిపిస్తోంది. తెలుగులో ఈ అమ్మడికి ఉన్న గిరాకీ అంతాఇంతా కాదు. అరవింద సమేతా, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి తనను తాను నిరూపించుకుంది. తాజాగా ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాధేశ్యామ్ సినిమాలో చేసింది. ఈ ముద్దుగుమ్మ కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా అలు బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలు చేస్తోంది. సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ సరసన సినిమాలను పూర్తి చేసుకుంది. మళ్లీ బాలీవుడ్‌లో ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. పూజా తెలుగులో అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చేసింది. అయితే నిన్న జరిగిన అలా వైకుంఠపురములో రీ యూనియన్ ఈ వెంట్‌లో అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ మాట్లాడారు. ఇందులో సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుట్టబొమ్మ పూజా నోరు జారింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను మరో సినిమా చేయనున్నాని చెప్పేసింది. దాంతో త్రవిక్రమ్, ఎన్‌టీఆర్ కాంబోలో రానున్న సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్‌గా చేయనుందని అనుకుంటున్నారు. ఈ సినిమాకు అయినను పోయిరావలే హస్తినకు అనే పేరు పరిశీలనలో ఉంది. ఇంతోల చౌడప్ప నాయుడు మరికొన్ని పేర్లు కూడా చర్చల్లోకి వచ్చాయి. అయితే అరంవిద సమేతా, అలా వైకుంఠపురములో సినిమాలను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన పూజా ఇప్పుడు హ్యాట్రిక్ చేయనుంది. దాంతో అభిమానుల్లో ఈ విషయం పై ఊరట పెరుగుతోంది. ఈ సారి అమ్మడు ఎలా కనిపించనుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.