ఎన్‌టీఆర్ సినిమా కోసం పోటీ పడుతున్న హీరోయిన్స్..?

ఎన్‌టీఆర్ సినిమా కోసం పోటీ పడుతున్న హీరోయిన్స్..?

యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా స్థాయి సినిమా తరువాత తాను చేసే సినిమాలు కెరీర్‌పై అధికంగా ప్రభావం చూపుతాయని గ్రహించిన ఎన్‌టీఆర్ కథల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ తరువాతి సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓకే చేసుకున్నారు. త్రివిక్రమ్-ఎన్‌టీఆర్ కాంబోలో రానున్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్‌టీఆర్ సరసన ఎవరు నటించనున్నారన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్‌ల పేర్లు వినిపించాయి.  కానీ తాజాగా ఈ రేసులో బాలీవుడ్ భామ కియారా అద్వానీ కూడా చేరారు. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇద్దరు హీరోయిన్‌లు పోటీ పడుతున్నారు. ఈ సినిమాకు బుట్టబొమ్మ పూజా హెగ్డె, కియారా అద్వానీ వీరిలో ఒకరు ఫిక్స్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం కియారాకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఒకవేళ కియారా నో చెప్తే పూజా ఫిక్స్ అని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అతి త్వరలోనే ఈ సినిమా కథానాయిక గురించి ప్రకటిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఇద్దరి బామల్లో ఎవరు ఎన్‌టీఆర్ సరసన చేస్తారో వేచి చూడాలి.